
ఎన్నిసార్లు ఫిర్యాదు చేయాలి
జీవీఎంసీ జోన్–2 పరిధిలోని మధురవాడలో ప్రభుత్వ పార్కు స్థలాలు కబ్జాకు గురై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏడవ వార్డు బొట్టవానిపాలెం ఈడబ్ల్యూఎస్ లేఅవుట్, స్వతంత్ర నగర్‌లో సుమారు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన జీవీఎంసీ పార్కులో 150 గజాల స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆలయం పేరుతో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఈ నెల 5న జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 19న జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించగా, సమస్య పరిష్కారమైనట్లు మెసేజ్ వచ్చింది. కానీ వాస్తవంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అదే విధంగా, ఏడో వార్డులోని కళానగర్, కృష్ణ నగర్ పార్కులు, స్వతంత్ర నగర్‌లోని బ్రహ్మంగారి గుడి ఎదురుగా ఉన్న మరో జీవీఎంసీ పార్కు స్థలాలు కూడా కబ్జాకు గురై, అనధికారికంగా కరెంటు మీటర్లు కూడా ఏర్పాటు చేశారు. జోనల్ కమిషనర్ ఆక్రమణదారులకు మద్దతు పలుకుతున్నారు. కబ్జాలను అరికట్టి, ప్రభుత్వ పార్కు స్థలాలను కాపాడాలి.
–రజిని, సామాజిక కార్యకర్త