ప్రీ ప్రైమరీ పాఠ్య రూపకర్తగా మోహిద్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రీ ప్రైమరీ పాఠ్య రూపకర్తగా మోహిద్‌

Jun 4 2026 7:27 AM | Updated on Jun 4 2026 7:27 AM

బషీరాబాద్‌: రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి రూపొందించిన ప్రీ ప్రైమరీ హ్యాండ్‌బుక్‌ అభివృద్ధి ప్రక్రియలో బషీరాబాద్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి స్థానం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది నిష్ణాతులైన ఉపాధ్యాయులతో కూడిన పాఠ్య రూపకల్పన బృందంలో బషీరాబాద్‌ (ఇందిరానగర్‌) ఎంపీపీఎస్‌ పాఠశాల ఉపాధ్యాయుడు మహమ్మద్‌ మోహిద్‌కు సభ్యుడిగా ఇంగ్లిష్‌ భాషా పాఠ్యాంశ రూపకల్పనలో తన వంతు సహకారం అందించారు. విద్యాభివృద్ధిలో చురుకై న పాత్ర పోషిస్తున్న మొహీద్‌ సేవలను పలువురు ఉపాధ్యాయులు ప్రశంసించారు. ప్రీ ప్రైమరీ హ్యాండ్‌బుక్‌ రూపకల్పనలో భాగస్వామ్యం కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement