ధరలు పెరిగాయి
కొడంగల్: వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. వర్షాలు కురిస్తే విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. ఎరువుల ధరలపై నియంత్రణ లేకపోవడంతో రోజు రోజుకు పెరుగుతున్నాయి. విత్తనాలు వేసే సమయంలో భూమిలో శక్తి కోసం వేసే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు మండుతున్నాయి. దీంతో సాగు ఖర్చులు పెరిగాయి. రైతు భరోసా పూర్తి స్థాయిలో అందక.. పెట్టుబడి ఎలా అని కర్షకులు ఆందోళన చెందుతున్నారు.
పంట రుణాలకు పెట్టుబడి సాయం
ప్రభుత్వం సాగు పెట్టుబడికి రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు చొప్పున విడుదల చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నగదును బ్యాంకర్లు పంట రుణాల్లో జమ చేస్తున్నారు. దీంతో రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికే రైతులు ఖరీఫ్ సీజన్‌కు వ్యవసాయ పనులు ప్రారంభించారు. మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. సన్న చిన్నకారు రైతులు పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గంలో ఖరీఫ్ సీజన్‌లో సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు సాగు చేపట్టనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంపై విమర్శలు వస్తున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఒక్కో బస్తా ఒక్కో విధంగా ఉంది. వాటి నాణ్యతా ప్రామాణాలను బట్టి ధరను నిర్ణయించారు. కాంప్లెక్స్ ఎరువులు ఒక్కో బస్తాపై సుమారు రూ.300 పైగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఎరువుల ధర
డీఏపీ రూ.1,350
కాంప్లెక్స్ రూ.2,300
10.26.26 రూ.2,250
యూరియా రూ. 266
ఎస్‌ఏపీ రూ.775
వానాకాలం సాగు సమయంలో రేట్లు ౖపైపెకి
పెట్రోల్, డీజిల్ పెరిగాయంటూ ఇష్టానుసారంగా పెంపు
ఆందోళనలో రైతులు
విత్తనాల ధరలు
రకం ధర(బస్తాలు)
కిలో కంది రూ.310
జొన్నలు(3కేజీ) రూ.450
వరి రూ.450
పత్తి రూ.810–రూ.900
పెసర రూ.720
గతేడాది కంటే ఈ సంవత్సరం ఎరువుల ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎరువుల ధరలు పెరిగాయి. రైతులకు ఈ ధరలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ప్రభుత్వం రైతులకు సాగు ఖర్చుల కోసం రైతు భరోసా ఇస్తోంది. ఆ డబ్బుతో ఎరువులు కొనుగోలు ఇబ్బంది తగ్గుతుంది.
– శివకుమార్ గుప్తా, కొడంగల్


