మహిళా సంఘాలు భేష్
తాండూరు: బ్యాంకు రుణాలు తీసుకుని బడా వ్యాపారులు దేశం వదిలి వెళ్లిపోతే.. తెలంగాణ మహిళ సమాఖ్య సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీ రుణాలు చెల్లించడంలో పరిణతి సాఽధించారని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మహిళా వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అథితిగా హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డితో కలిసి సందర్శించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజీ ద్వారా రూ.212 సంఘాలకు రూ.28.19 కోట్లు, 1,001 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.1.61 కోట్లు, సీ్త్ర నిధి పథకం ద్వారా 332 సంఘాలకు రూ.6.67 కోట్లు, తాండూరు మున్సిపల్ పరిధిలోని 500 మంది వీధి వ్యాపారులకు రూ.8 కోట్ల రుణాలకు సంభందించిన చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మహిళలకు వ్యాపారాలలో చోటు కల్పించేందుకు ఇప్పటికే పంట ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. త్వరలో నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు ఆర్టీసీలో భాగస్వాములను చేయనున్నామని చెప్పారు. నియోజవకర్గంలోని నాలుగు ప్రైవేటు బస్సులు ఆర్టీసీలో నడిపించేందుకు బస్సులు కేటాయించామన్నారు. పాఠశాల నిర్వహణ భాద్యతలలో భాగంగా స్కూల్ యూనిఫామ్స్, తయారీ, మహిళా శక్తి క్యాంటీన్‌లు, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. గ్రామాలలో మహిళా సంఘాల కోసం వంద మహిళా సమాఖ్య భవనాలను రూ.10 కోట్లను మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, టీఎంసీ రాజేంద్రప్రసాద్, డీఈ ఈ మణిపాల్, ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులున్నారు.
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి


