ప్రణాళికలు సిద్ధం చేయండి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికలు సిద్ధం చేయండి

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

అనంతగిరి: గ్రామాలు, పట్టణాల్లో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లలతో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పర్యావరణ వారోత్సవాల్లో చేపట్టే అవగాహన అవగాహన కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్‌, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వా ర్డు సభల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వ్యవసాయం, విపత్తుల నిర్వహ ణ, గ్రామంలో జరిగే కార్యక్రమాలపై అందరికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఎస్పీ స్నేహమెహ్ర, అదనపు కలెక్టర్లు ఉమా శంకర్‌ ప్రసాద్‌, వెంకటాచారి, డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, వ్యవసాయ అధికారి రాజారత్నం, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దీపక్‌తివారి

Advertisement
 
Advertisement
Advertisement