బషీరాబాద్: ఇందిరమ్మ పథకంతో పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో గూడులేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామని చెప్పారు. బుధవారం బషీరాబాద్ మండలం కాశీంపూర్, ఇందర్‌చెడ్ గ్రామాల్లో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇళ్లకు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సంరద్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. త్వర లో మలివిడత కింద పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు ఇంటి జాగ ఉన్న వారికి ఇళ్లు ఇచ్చామని, మున్ముందు జాగలు లేని వారికి ప్రభుత్వమే జాగ ఇచ్చి ఇళ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. అందుకే సంక్షేమ పథకాలు వారి పేరునే అమలు చేస్తున్నామన్నారు.
అంతరాష్ట్ర రోడ్ల అనుసంధానం
జిల్లా సరిహద్దులో ఉన్న బషీరాబాద్‌కు పొరుగున ఉన్న కర్ణాటక రోడ్లతో అనుసంధానం చేయడానికి కొత్త రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. యాలాల మండలం బండమీదిపల్లి గేటు–మైల్వార్ మీదుగా కర్నాటకలోని సేడం జాతీయ రహదారికి అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. బషీరాబాద్–హల్కోడ వరకు రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. జీవన్గీ రోడ్డు పూర్తయితే తాండూరు మండలం కరణ్‌కోట్ నుంచి బషీరాబాద్ మీదుగా కర్ణాటకకు భారీ వాహనాల రాకపోకలకు వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి, ఆత్మ చైర్మన్ శంకర్‌రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ వెంకట్ రామ్‌రెడ్డి, బషీరాబాద్ సర్పంచ్ వెంకటేశ్ మహరాజ్, మాజీ వైస్ చైర్మన్ అజయ్‌ప్రసాద్, మాజీ ఏఎంసీ మాణిక్‌రెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చందర్‌నాయక్, బిచ్చిరెడ్డి, జీవన్గీ నర్సిరెడ్డి, మంతట్టి తలారి సురేశ్, బిచ్చిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, లబ్ధిదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కుల్కచర్ల: ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు లందజేస్తుందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని దాస్యనాయక్ తండాలో గంగావిఠల్ నాయక్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినహామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు తిరుపతయ్య, శ్రీను, ఎంపీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మయ్య, చౌడాపూర్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య గౌడ్, ఏఎంసీ డైరక్టర్ రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
మలివిడతలో భారీగా ఇందిరమ్మ ఇళ్లు
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి


