ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ హామీలను నెరవేర్చాలి

Apr 30 2026 9:36 AM | Updated on Apr 30 2026 9:36 AM

కందుకూరు: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మెల్యే సబితారెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో 257 మందికి కల్యాణలలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెబుతూ పురుషులకు టికెట్ల ధరలు పెంచారన్నారు. నేదునూరులో పండించిన కుసుమ పంట కోసం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ గోపాల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.కృష్ణనాయక్‌, ఎంపీడీఓ బి.సరిత, స్థానిక సర్పంచ్‌ సరికొండ పాండు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement