దోమ: సంజీవ స్వామి ఆలయ భూములను దేవాదాయ శాఖ అధికారులు కౌలు వేలం వేశారు. బుధవారం మండల పరిధి దొంగ ఎన్కేపల్లి గ్రామం ఆలయ ఆవరణలో వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి ఆలయ ఈఓ నరేందర్, శ్రీ సంజీవ స్వామి ఆలయ ఈఓ బాలనర్సయ్య, ఎండోమేంట్ అధికారి ప్రణీత్, పోలేపల్లి ఎల్లమ్మ తల్లి ఈఓ రాజేందర్‌రెడ్డిలు కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి మొత్తం 104.19 ఎకరాల భూమి ఉండగా.. కొంత అన్యాక్రాంతం అయినప్పటికీ.. మిగతా వాటికి ప్రతి రెండేళ్లకు వేలం వేస్తుంటారు.
వేలం వేసిన భూములు..
కిష్టాపూర్ 167 సర్వే నంబర్‌లో 38 గుంటలు, బ్రాహ్మణపల్లి 103 సర్వే నంబర్ 1.31 గుంటలు, హీరాపూర్ 23 సర్వే నంబర్ 4.18, రావులపల్లి 36 సర్వే నంబర్ 4.28, మంచన్‌పల్లి 66 సర్వే నంబర్ 9.39, ఖుదావంద్‌పూర్ 108 సర్వే నంబర్‌లో 4.20 గుంటలకు కౌలు వేలం వేయగా.. రూ.2,27,500లు ఆదాయం సమకూరింది.


