కొడంగల్ రూరల్: చికిత్స పొందుతున్న క్షతగాత్రుడు బుధవారం మృతి చెందాడు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని తెలంగ్‌వాడకు చెందిన శివకుమార్(31)న 27న రాత్రి రావులపల్లి రోడ్డు మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో శివకుమార్ అకస్మాత్తుగా కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రుడిని నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శివకుమార్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. కాగా ఎదురుగా వస్తున్న లారీ వెనుక భాగం శివకుమార్‌కు తగలడంతోనే కిందపడిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.


