ముగిసిన జనగణన ఎన్యుమరేటర్ల శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జనగణన ఎన్యుమరేటర్ల శిక్షణ

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

ముగిసిన జనగణన ఎన్యుమరేటర్ల శిక్షణ వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ ఓంకారేశ్వర స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం ప్రతీ వారం కంటి వైద్య శిబిరం అనుమానంతో హత్య

కుల్కచర్ల: జనగణన సర్వే నిర్వహించేందుకు కొనసాగుతున్న రెండో విడత శిక్షణ కార్యక్రమాలు బుధవారంతో ముగిసాయి. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కొనసాగుతున్న కార్యక్రమంలో తహసీల్దార్‌ మనోహర్‌ చక్రవర్తి, రెవెన్యూ అధికారులు జనగణనలో పాటించాల్సిన నియమనిబంధనల గూర్చి వివరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

కొడంగల్‌: అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మే 6వ తేదీన మండల పరిధిలోని అప్పాయిపల్లి(ఎరన్‌పల్లి)లో అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ ఉంటుందని ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌ బుధవారం వేర్వేరుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ మధుయాదవ్‌, ఎరన్‌పల్లి శ్రీనివాస్‌, మహిపాల్‌, గోకుల్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

కుల్కచర్ల: చౌడాపూర్‌ మండలం మందిపల్‌ ఓంకారేశ్వరాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఆలయంలో ఉన్న బోరును గుర్తుతెలియని వ్యక్తులు వేసి వదిలేశారు. తెల్లవారుజాము వరకు అలాగే ఉండడంతో మోటారు కాలిపోయి మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చామని ఆలయ అర్చకులు మఠం రాజశేఖర్‌ తెలిపారు. ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామన్ని చెప్పారు.

కుల్కచర్ల: కంటి వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వైధ్యాధికారి కిరణ్‌కుమార్‌, ఆప్తమాలిక్‌ అసిస్టెంట్‌ జవహార్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ వైద్యశిబిరంలో 54 మంది పాల్గొనగా 35 మందిని ఆపరేషన్‌ నిమిత్తం నగరంలోని పుష్పగిరి ఆస్పత్రికి రెఫర్‌ చేశామన్నారు.

గొడ్డలితో దాడి చేసిన భర్త

అక్కడికక్కడే ప్రాణం వదిలిన భార్య

మీర్‌పేట: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమైపె గొడ్డలితో దాడి చేసి చంపిన ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా శివన్నగూడకు చెందిన నల్లబోతు నర్సింహ, వసంత (52)కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం వచ్చి, ఇరవై ఏళ్లుగా బీఎన్‌రెడ్డినగర్‌ టీచర్స్‌కాలనీలో ఉంటున్నారు. నర్సింహ కూలీ, వసంత ఇళ్లలో పనిచేస్తూ జీవిస్తున్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 5:45 గంటలకు ఓ ఇంట్లో పని ముగించుకుని, ఇంటికి తిరిగి వస్తున్న భార్యకు ఎదురెళ్లిన నర్సింహ గొడ్డలితో దాడి చేశాడు. మెడ భాగంలో తీవ్ర గాయాలు కావడంతో వసంత సంఘటనా స్థలిలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మీర్‌పేట డీఐ గౌరునాయుడు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement