పాదచారిని ఢీకొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

పాదచారిని ఢీకొట్టిన కారు

Apr 30 2026 9:30 AM | Updated on Apr 30 2026 9:30 AM

పాదచారిని ఢీకొట్టిన కారు వృద్ధుడు అదృశ్యం అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి రేషన్‌డీలర్‌ ఎంపిక ప్రక్రియలో అవకతవకలు అర్హులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు

వృద్ధుడు మృతి

పరిగి: నడచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధుడిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గండీడ్‌ మండలం పీర్లగుట్టతండాకు చెందిన తుక్యానాయక్‌(65) పట్టణ కేంద్రంలోని బాలాజీనగర్‌లో తన కుమారుడి వద్ద ఉంటున్నాడు. ఉదయం టీ తాగేందుకు పట్టణ కేంద్రంలోని బహర్‌పేట్‌కు నడుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఎగిరిపడటంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు శంకర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బొంరాస్‌పేట: ఆస్పత్రికి వెళ్తున్నాని చెప్పి వెళ్లిన వృద్ధుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండల పరిధిలోని బుర్రితండా పంచాయతీ పరిధి పూల్యానాయక్‌ తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తండాకు చెందిన ముడావత్‌ రాంచందర్‌(63) ఈ నెల 27న తనకు అనారోగ్యంగా ఉందని హైదరాబాద్‌లో ఆస్పత్రికి వెళ్తున్నాని చెప్పి బయలు దేరాడు. తిరిగి రాకపోవడంతో బుధవారం కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

కొడంగల్‌ రూరల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని రుద్రారం శివారు పాటిమీదిపల్లి రోడ్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ జీవీ సత్యనారాయణ తెలిపిన ప్రకారం.. బషీరాబాద్‌ మండలం జీవన్గీ గ్రామానికి చెందిన తలారి హరికృష్ణ(26)ను తండ్రి నర్సింలు బంధువుల ఇంటికి వెళ్లి రమ్మని చెప్పి పంపాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం తన కుమారుడు మృతి చెందాడని సమాచారం అందిందని ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుడు హరికృష్ణ శరీరం నల్లగా మారడంతో విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడ, లేదా పిడుగుపాటుకు గురయ్యాడా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తండ్రి నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పుట్టపహాడ్‌ సర్పంచ్‌ అంజిలయ్య

కుల్కచర్ల: సివిల్‌ సప్లయ్‌ వ్యవస్థలో అధికారులు నియమనిబంధనలను పాటించడంలేదని పుట్టపహాడ్‌ సర్పంచ్‌ బోయిని అంజిలయ్య ఆరోపించారు. బుధవారం ఆయన గ్రామపంచాయతీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్‌కు తెలియకుండా తాత్కాలిక పద్ధతిన రేషన్‌డీలర్‌ను నియమించడం సరికాదన్నారు. కేవలం కొంతమందికి మద్ధతుగా మాత్రమే రేషన్‌ డీలర్‌ ఎంపిక ప్రక్రియ కొనసాగిందని జిల్లా అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

రంగారెడ్డి కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఇబ్రహీంపట్నం రూరల్‌: జిల్లాలో అర్హులైన జర్నలిస్టుందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు జారీ చేస్తామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన నూతన మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇందులో డీపీఆర్‌ఓ బాలేశ్వరి, మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు కె.శ్రీకాంత్‌రెడ్డి, శేఖర్‌ ఉప్పరి, సయ్యద్‌ ఇక్రముల్లా హుస్సైని, శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement