కొడంగల్: పట్టణంలోని పలు కాలనీల ప్రజలకు దొంగల భయం పట్టుకుంది. గతంలో శాంతినగర్ కాలనీలో పలుమార్లు చోరీలు జరిగాయి. ఇప్పుడు పట్టణంలోని సన్‌సిటీ కాలనీ ప్రజలు భయం గుప్పిట్లో నిద్రిస్తున్నారు. మంగళవారం రాత్రి కొంతమంది దుండగులు తాళం వేసిన ఇళ్లల్లోకి చొరబడి చోరీకి యత్నించారు. ఇళ్లలోని బీరువాలను తెరిచి చూశారు. కాగా చోరీల్లో ఎటువంటి ఆస్తి నష్టం కలగలేదు. ఈ విషయంపై కాలనీవాసులు బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సత్యనారాయణ ఉదయం కాలనీకి వెళ్లి సీసీ పుటేజీలు పరిశీలించి దుండగులు సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. రాత్రి వేళ గస్తీ పెంచుతామని ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని భరోసా కల్పించారు.


