బొంరాస్‌పేట: అవగాహనతో సాగుచేస్తే అధిక లాభాలు వస్తాయని డీఏటీటీ సెంటర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. వ్వయసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ బీటీటీ(బ్లాక్ టెక్నాలజీ టీమ్) కన్వీనర్ శంకర్ రాథోడ్ ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని రేగడిమైలారం రైతు వేదికలో రైతులకు శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీఎఫ్‌ఏసీ, సామర్థ్య నిర్మాణం, నైపుణ్యత కొరకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. డీఏటీటీ సెంటర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రాజేశ్వర్‌రెడ్డి వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, నవీన మార్పులు, నానో యూరియా, నానో డీఏపీ, పంటమార్పిడి, కంది పట్టి పంటలపై చీడపీడల నివారణ అంశాలపై వివరించారు. ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన, సస్యరక్షణ చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ బాలకృష్ణ, వినోద్, ఏఈఓలు హేమ, స్వాతి, శైలజ, జగదీశ్, సర్పంచు చిట్టెమ్మ, ఉపసర్పంచు చంద్రప్ప, గుండప్ప, వీరప్ప, వార్ల సురేశ్ తదితరులున్నారు.
డీఏటీటీ సెంటర్ ఏరువాక కేంద్రం
శాస్త్రవేత్త రాజేశ్వర్‌రెడ్డి


