మోమిన్‌పేట: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాల్‌కు రూ. 2,400 మద్దతు ధర ప్రకటించిందని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ఏఈఓ ఇచ్చిన కూపన్‌తో పాటు ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు పుస్తకం జిరాక్సు, ఫోన్ నంబర్ తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ నాగార్జున, పీఏసీఎస్ మోమిన్‌పేట ప్రత్యేకాధికారి మాధవి, తహసీల్దార్ రవీందర్, ఏఓ రామకృష్ణారెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు సురేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు సుభాశ్‌గౌడ్, ఎరాజ్, ఎజాస్, నర్సింలు, సీఈఓ శేఖర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
మర్పల్లి ఏఎంసీ చైర్మన్ మహేందర్‌రెడ్డి


