సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పరిగి: పరిగి తైబజారులో అక్రమార్కులు యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు. మున్సిపల్ అధికారులే ప్రైవేటు వ్యక్తులను పెట్టి అక్రమంగా తైబజారు రుసుము వసూళు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా తైబజారును లీజ్ తీసుకున్న వ్యక్తి డబ్బు వసూలు చేయాల్సి ఉంటుంది. గత నెల ఆయన లీజ్ పూర్తవడంతో నాటి నుంచి మున్సిపల్ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో తైబజార్ వసూలు చేస్తున్నారనే చర్చలు వినిపిస్తున్నాయి. ప్రతీ శుక్ర, శనివారం పట్టణ కేంద్రంలో ప్రత్యేకంగా సంత జరుగుతుంది. ప్రతి రోజు సుమారుగా రూ.20 వేల వరకు తైబజార్ వసూలవుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం ప్రభుత్వానికి రూ.3 వేలు మాత్రమే చూపుతున్నారనే అపవాదు ఉంది. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితమే తైబజారు లీజు గడువు ముగిసినా ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈనెల 7న నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
● శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్
● ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్ జయంత్యుత్సవం
రూ.20 వేలు వసూలైనా ప్రభుత్వానికి లెక్క చూపేది రూ.3వేలు
ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్


