అగ్గనూరు వాసికి ఆర్మీ లెఫ్టినెంట్‌ హోదా | - | Sakshi
Sakshi News home page

అగ్గనూరు వాసికి ఆర్మీ లెఫ్టినెంట్‌ హోదా

Apr 6 2026 8:36 AM | Updated on Apr 6 2026 8:36 AM

యాలాల: మండల పరిధిలోని అగ్గనూరు గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు(పీడీ) పల్లె భరత్‌రెడ్డికి ఆర్మీ లెఫ్టినెంట్‌ హోదా లభించింది. ఉస్మానియా వర్సిటీ పరిధిలోని ప్రైవేటు కళాశాలలో ఎన్‌సీసీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన నాగపూర్‌లో మూడు నెలల పాటు మిలటరీ శిక్షణ పొందారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న భరత్‌రెడ్డికి శనివారం లెఫ్టినెంట్‌ ర్యాంకు కార్డును బ్రిగేడియర్‌ నిరంజన్‌ జో అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బెటాలియన్‌ ఏఓ లెఫ్టినెంట్‌ కల్నల్‌ మంజుల్‌ శర్మ భరత్‌రెడ్డిని అభినందించారు. తనను ప్రొత్సహించిన హైదరాబాద్‌ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ ప్రశాంత్‌కుమార్‌, ఏపీ, తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ నర్సింగ్‌ శైలానీకి భరత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement