అనారోగ్యంతో భార్య, గుండెపోటుతో భర్త మృతి
మోమిన్‌పేట: మృత్యువులోనూ దంపతులు అనుంబంధం వీడలేదు. ఈ ఘటన మండల పరిధిలోని ఏన్కతల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ప్యాట లక్ష్మయ్య, భాగ్యమ్మ దంపతులు. భాగ్యమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మృతి చెందింది. సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి. భార్య మృతిని తట్టుకోలేక బాధపడుతున్న లక్ష్మయ్య రాత్రి 11గంటల సమయంలో గుండెపోటుతో మత్యువాత పడ్డాడు. వారికి ఒక కూతురు, కుమారుడు సంతానం.


