తాండూరు రూరల్: ఉపాధ్యాయుల సీనియార్టీ ప్రకారం జనగణన విధులు కేటాయించాలని తపస్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం పెద్దేముల్ తహసీల్దార్ వెంకట్‌ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా విధులు వేయొద్దన్నారు. వీరిలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్, నరహరిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల అనిల్, నాయకులు మహేశ్, విజయలక్ష్మి, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
వెండి విగ్రహం అందజేత
కుల్కచర్ల: మండలంలోని బండవెల్కిచర్లలో కొలువుదీరిన పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఓ భక్తుడు వెండి విగ్రహం బహూకరించారు. మంగళవారం షాద్‌నగర్‌కు చెందిన షాలిని అమర్నాథ్ దంపతులు 95 తులాల వినాయక విగ్రహం అందజేశారు. అంతారం గ్రామానికి చెందిన మరో భక్తుడు బాసుపల్లి శాంతిరెడ్డి దంపతులు 50 కిలోల ఇత్తడి గంటను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు పాండుశర్మ మాట్లాడుతూ.. రామలింగేశ్వరుడికి భక్తులు కానుకలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని అన్నారు.
గ్రామాభివృద్ధిలో
వార్డు సభ్యులే కీలకం
డీఎల్‌పీఓ సంధ్యారాణి
బంట్వారం: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ వార్డు సభ్యుల పాత్ర ఎంతో కీలకమని డీఎల్‌పీఓ సంధ్యారాణి అన్నారు. కోట్‌పల్లి మండల వార్డు సభ్యుల శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి మంగళవారం హాజరై మాట్లాడారు. పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, చేపట్లాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్‌రెడ్డి, ట్రైనర్లు పాల్గొన్నారు.
పుట్టపహాడ్ తైబజార్ వేలం
కుల్కచర్ల: గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులను పెంచేందుకు అందరి సహకారంతో కృషి చేస్తామని పుట్టపహాడ్ సర్పంచ్ బోయిని అంజిలయ్య అన్నారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో సంతకు వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన అంజమ్మ రూ.50 వేలకు వేలం హక్కులు పొందారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శాస్త్రి, పంచాయతీ కార్యదర్శి కవిత, వార్డుసభ్యుడు వెంకట్రాములు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
డాక్టరేట్ ప్రదానం
షాద్‌నగర్ రూరల్: దేశ రాజధాని న్యూఢిల్లీలో వరల్డ్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రొటెక్షన్ కమిషన్ సభ్యుడిగా మ్యాగ్నెట్ విద్యాసంస్థల అధినేత ఎండీ వాజీద్ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసి సత్కరించారు.


