కరెంటు సరఫరాకు అంతరాయం
తాండూరు రూరల్: ఎర్రమట్టి టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన పెద్దేముల్ మండలం రాంసింగ్ తండా వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండా సమీపంలో ఎర్రమట్టి క్వారీలు ఉన్నాయి. క్వారీ నుంచి ఓ టిప్పర్ రోడ్డుపైకి వచ్చే క్రమంలో అతివేగంగా విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. వాహనం బోల్తా పడి స్తంభం విరిగి విద్యుత్ తీగలు రోడ్డుపై పడ్డాయి. దీంతో అడికిచెర్ల, పాషాపూర్, రాంసింగ్ తండా, ఊరేంటి తండా, బాయిమీదితండాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. లారీ డ్రైవర్ పరారయ్యాడు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఆ శాఖ అధికారులు తెలిపారు.


