ఇబ్రహీంపట్నం: ఉత్కంఠకు తెరపడింది.. 50 రోజుల తర్వాత ఎట్టకేలకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం చిక్కుముడి వీడింది. నాలుగు వారాల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని గత నెల 3న న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం శనివారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగ్గా 13న ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల అధికారులు 16న సమావేశం నిర్వహించి కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెంటనే జరగాల్సిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి తిరుగుబాటుతో రసకందాయంలో పడింది. గందరగోళ పరిస్థితులు నెలకొని గత నెల 16, 17 తేదీల్లో నిర్వహించిన ఎన్నిక ప్రక్రియ వివాదాల నేపథ్యంలో వాయిదా పడిన సంగతితెలిసిందే.
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు 8 మంది కాంగ్రెస్, 13 మంది బీఆర్‌ఎస్, ఇద్దరు బీజేపీ, ఒక ఇండిపెండెంట్ సభ్యుడితో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యుడు, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. కాసేపటికే కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్ ఆకుల యాదగిరి, ఎక్స్ అఫీషియో సభ్యులు వాకౌట్ చేస్తూ సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన టేకుల సుదర్శన్‌రెడ్డిని చైర్మన్‌గా నీలం శ్వేత ప్రతిపాదించగా క్యామ శంకర్ బలపర్చారు. 11 మంది బీఆర్‌ఎస్, ఒక బీజేపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు తెలిపారు. దీంతో సుదర్శన్‌రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణారెడ్డి ప్రకటించారు. వైస్ చైర్ పర్సన్‌గా బీజేపీకి చెందిన ముత్యాల శ్యామలను బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు బుగ్గరాములు, శ్రీలత ప్రతిపదిస్తూ బలపరిచారు. వైస్ చైర్ పర్సన్‌గా శ్యామల ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో రెండుసార్లు ఈ ఎన్నిక కోసం నిర్వహించిన కౌన్సిల్ సమావేశాలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈసారి ప్రశాంతంగా ప్రక్రియ ముగిసింది. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు.
గత రెండు పర్యాయాలు చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్వంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు మహేందర్‌రెడ్డి, సత్యనారాయణ, మధు ఆధ్వర్యంలో సుమారు 400 మందికి పైగా బందోబస్తులో నిమగ్నమయ్యారు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విప్ ఉల్లంఘించిన 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డికి బీఆర్‌ఎస్ నాయకులు శనివారం ఫిర్యాదు చేశారు.
చైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ఆకుల అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి
వైస్ చైర్ పర్సన్ శ్యామల (బీజేపీ)
చైర్మన్ సుదర్శన్‌రెడ్డి (బీఆర్‌ఎస్)
ఎట్టకేలకు వీడిన చిక్కుముడి
మున్సిపల్ పీఠంకై వసం చేసుకున్న గులాబీ పార్టీ
వైస్ చైర్‌పర్సన్ పదవిదక్కించుకున్న బీజేపీ
చైర్మన్‌గా టేకుల సుదర్శన్‌రెడ్డి,వైస్ చైర్ పర్సన్‌గా ముత్యాల శ్యామల
వాకౌట్ చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి