ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

ఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 రైతుల భూములు లాక్కుంటే సహించేది లేదు దోమ: పరిశ్రమల పేరుతో రైతుల భూములను లాక్కుంటే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బట్లచందారం గ్రామంలో భూము లు కోల్పోతున్న రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో పేద రైతులే ఎక్కువగా ఉన్నారని, వారి భూములను తీసుకుంటే రోడ్డున పడతారని తెలిపారు. ప్రభు త్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ మల్లేశ్‌, రైతులు పాల్గొన్నారు. జగ్జీవన్‌ రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి క్రీడా పాఠశాలకు ఇద్దరు విద్యార్థినులు వికారాబాద్‌: జనగణనకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో గణాంకాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో కసరత్తు ప్రారంభించారు. జనాభా లెక్కల కోసం ఉపాధ్యాయులను వినియోగించుకోవాలా వద్దా అనే దానిపై మొదల్లో సందిగ్దత నెలకొనగా చివరకు వారితో చేయిస్తేనే లెక్క కచ్చితంగా ఉంటుందనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఆయా శాఖల్లో ఎంత మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌ వైజర్లు, చార్జ్‌ ఆఫీసర్లుగా ఎవరిని నియమించాలి అనే దానిపై కలెక్టర్‌ పర్యవేక్షణలో కసరత్తు చేస్తున్నారు. ప్రతి పదేళ్లకోసారి దేశంలో జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో 2011 తర్వాత 2021లో ప్రక్రియ జరగాలి.. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఐదేళ్ల ఆలస్యంగా జనగణనకు సిద్ధమవుతున్నారు. ఇటీవలో కలెక్టర్‌ జిల్లాస్థాయి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమం కూడా పూర్తి చేశారు. మండల స్థాయిలో ఎన్యుమరేటర్లకు ఈ నెల 18 నుంచి శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రెండు విడతల్లో.. ఈ సారి రెండు వేడతల్లో జనగణన ప్రక్రియ చేపట్టనున్నారు. మొదటి విడత సర్వే మే 11న ప్రారంభమై జూన్‌ 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ దశలో జనాభా జోలికి వెళ్లకుండా కుటుంబాలను మాత్రమే లెక్కిస్తారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా కుటుంబాల లెక్క తేల్చనున్నారు. రెండో విడత సర్వే 2027 ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. అప్పుడు జనాభా వివరాలు సేకరిస్తారు. ఇప్పటి వరకు జనాభా వివరాలు కాగితాలపై ముద్రించి ఫైళ్ల రూపంలో భద్రపరుస్తూ వచ్చారు. సాంకేతికంగా అనేక మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ సారి సర్వేని డిజిటలైజ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వే కోసం ఎన్ని ట్యాబ్‌లు అవసరం..? వాటిని ఎలా సమకూర్చుకోవాలి..? డిజిటల్‌ సర్వే చేసే సంకేతిక పరిజ్ఞానం తెలిసిన ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు..? తదితర విషయాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. సర్వే చేసేందుకు ఎంత మంది అందుబాటులో ఉన్నారనే విషయాన్ని విద్యాశాఖ నుంచి తెప్పించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల ఇన్‌చార్జ్‌ ఆఫీసర్లుగా ఎంఈఓలు, తహసీల్దార్లు వ్యవహరించనుండగా.. మున్సిపాలిటీల్లో కమిషనర్లు ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. సూపర్‌ వైజర్లుగా గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు, సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్లను తీసుకున్నారు. ఎన్యుమరేటర్లుగా జూనియర్‌ అసిస్టెంట్‌ ఉపాఽధ్యాయులు, ఎస్జీటీలు వ్యవహరించనున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 300 కుటుంబాలతో కూడిన బ్లాక్‌ను ఏర్పాటు చేసి అప్పగిస్తారు. మొదటి విడత సర్వేలో 34 కాలమ్స్‌తో కూడిన డిజిటల్‌ ఫారాల ద్వారా సర్వే చేస్తారు. వ్యాక్సినేషన్‌ తప్పనిసరి అనంతగిరి: పశు వైద్యాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని పశుసంవర్ధక శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్బారాయుడు అన్నారు. శనివారం వికారాబాద్‌లోని జిల్లా పశువైద్యాధికారి కార్యాలయం, కొత్తగడి వైద్యశాలను సందర్శించారు. ఈ సందర్భంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీని పర్యవేక్షించారు. జిల్లాలో ఎంత టార్గెట్‌ ఉంది, ఎంత మేర పూర్తి చేశారని అడిగారు. పశువుల పెంపకంపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. పశువులకు టీకాలు తప్పిని సరిగా వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ సదానందం, ఏడీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నవాబుపేట: పశువులకు సకాలంలో వైద్యం చేయడం, టీకాలు వేయడంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సుబ్బారాయుడు అన్నారు. శనివారం మండలంలోని మాదిరెడ్డిపల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పశువైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. సేవాభావంతో పనిచేయాలన్నారు. పశువులకు వ్యాక్సిన్‌ వేసిన వెంటనే పశు ధన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఇందులో నవాబుపేట్‌ మండలం మొదటి స్థానంలో ఉందన్నారు. కృషి చేసిన డాక్టర్‌ విశ్వనాథం, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ సదానందం, సిబ్బంది కనకరాణి, రైతులు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

జనగణనకుసిద్ధమవుతున్న యంత్రాంగం

ఇప్పటికే జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం పూర్తి

18నుంచి మండలస్థాయి శిక్షణ శిబిరాలు

మే 11 నుంచి జూన్‌ 9 వరకు కుటుంబాల సర్వే

రెండు విడతల్లో ప్రక్రియ

జిల్లా జనాభా 9,27,140

రెండు లక్షల వరకు పెరిగే అవకాశం

మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

దోమ: బాబు జగ్జీవన్‌ రామ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్‌ రామ్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. యువత, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, చిన్న శ్రీశైలం యాదవ్‌, హైకోర్టు న్యాయవాది ఆనందం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొప్పుల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కుల్కచర్ల: మండలంలోని చెల్లాపూర్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు క్రీడా పాఠశాలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆనంద్‌ శనివారం తెలిపారు. 3వ తరగతి విద్యార్థి కోస్గి హరిప్రియ, పుట్టపహాడ్‌ అక్షర జిల్లాస్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో ప్రతిభ చాటి క్రీడా పాఠశాలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. విద్యార్థినులను అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్‌ సంతోష, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు, దస్తయ్య అభినందించారు.

పశు వైద్యాధికారులు అందుబాటులో ఉండాలి

పశుసంవర్ధక శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సుబ్బారాయుడు

జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి

కొడంగల్‌లో డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ దీపక్‌ తివారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement