సమస్యలు పరిష్కరించాల్సిందే | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాల్సిందే

Mar 31 2026 10:38 AM | Updated on Mar 31 2026 10:38 AM

అనంతగిరి: ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ సాయిలు అన్నారు. సోమవారం వికారాబాద్‌ డివిజన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుందరికీ విద్యుత్‌ శాఖలో ఒకే సంస్థ ఒకే రూల్స్‌ ఉంటుందని.. కానీ మన శాఖలో మాత్రం చట్టానికి విరుద్ధంగా రెండు రూల్స్‌ అమలు చేయడం అన్యాయమన్నారు. కార్మికులతో యాజమాన్యం వెట్టి చాకిరీ చేయిస్తోందని ఆరోపించారు. ప్రమోషన్స్‌ ఇవ్వకుండా మేనేజ్‌మెంట్‌ మోసం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రంలో కమిటీ సభ్యులు వికారాబాద్‌ మహేష్‌, బిచ్చిరెడ్డి, అక్తర్‌ అలి, బాల్‌రాజు, సుభాన్‌, వెంకటయ్య, అశోక్‌, కిరణ్‌, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.

● లేదంటే సమ్మెకు వెళ్తాం

● ఆర్టిజన్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ సాయిలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement