తైబజార్‌ వేలం రూ.6,50,810 | - | Sakshi
Sakshi News home page

తైబజార్‌ వేలం రూ.6,50,810

Mar 31 2026 10:38 AM | Updated on Mar 31 2026 10:38 AM

ధారూరు: ధారూరు తైబజార్‌కు సోమవారం వేలం నిర్వహించగా అవుసుపల్లికి చెందిన కోడిగంటి షాబాద్‌ శ్రీనివాస్‌ రూ.6,50,810కు పాట దక్కించుకున్నారు. ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ ప్రమీలగౌడ్‌ ఆధ్వర్యంలో కార్యదర్శి అంజానాయక్‌ వేలం నిర్వహించారు. గత ఏడాది కూరగాయల మార్కెట్‌ ద్వారా పంచాయతీకి రూ.6,01,000 ఆదాయం సమకూరింది. తాజాగా వేలం దక్కించుకున్న శ్రీనివాస్‌ ప్రతి శనివారం మార్కెట్‌లో కూరగాయలు విక్రయించే వారి నుంచి నిర్ణీత రుసుం వసూలు చేసుకోవచ్చు. వేలం పాటలో ఎంపీఓ షఫీఉల్లా, ఉప సర్పంచ్‌ జహంగీర్‌, వార్డు మెంబర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.

తుంకిమెట్లలో..

బొంరాస్‌పేట: మండలంలోని తుంకిమెట్లలో ఆదివారం సంతకు సోమవారం వేలం నిర్వహించారు. సర్పంచ్‌ ఎల్లమ్మ ఆధ్వర్యంలో డీఎల్‌పీఓ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీఓ రవినాయక్‌ సమక్షంలో వేలం జరిగింది. గ్రామానికి చెందిన చాకలి నర్సింలు రూ.3.65లక్షల వేలం దక్కించుకున్నారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి 2027 మార్చి చివరి వరకు రుసుం వసూలు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement