బయో మాస్‌ పెల్లెట్స్‌ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

బయో మాస్‌ పెల్లెట్స్‌ పంపిణీ

Mar 30 2026 12:00 PM | Updated on Mar 30 2026 12:00 PM

బయో మాస్‌ పెల్లెట్స్‌ పంపిణీ

మొయినాబాద్‌: ఎల్‌పీజీ గ్యాస్‌ కొరతకు ప్రత్యా మ్నాయంగా బయో మాస్‌ పెల్లెట్స్‌ తయారు చేస్తున్నట్టు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జస్టిస్‌ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బయో మాస్‌ పెల్లెట్‌ వుడ్‌ గ్యాసిఫియర్‌ను మున్సిపల్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఆదివారం ప్రారంభించారు. స్థానిక హోటల్‌ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తయారు చేసిన బయో మాస్‌ పెల్లెట్‌ వుడ్‌ గ్యాసిఫియర్‌ బాగా పనిచేస్తుందని.. చాలా మందికి నచ్చి ప్రొడక్షన్‌ పెంచాలని అడుగుతున్నారన్నారు. ఈ గ్యాసిఫియర్‌ ప్రైమరీ ఫైర్‌, సెకండరీ ఫైర్‌ రెండు రకాలుగా పనిచేస్తుందన్నారు. వ్యవసాయ వ్యర్థాలు బయో వుడ్‌ గ్యాసిఫియర్‌ ఇందనంగా వాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్‌, కౌన్సిల్‌ సభ్యుడు సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్‌ షాబాద్‌ కిషన్‌, బీజేపీ మున్సిపల్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ వెంకటేశ్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ రత్నం, నాయకులు మోర నర్సింహారెడ్డి, రవీందర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement