తాగు నీటి సమస్యను అధిగమిస్తాం | - | Sakshi
Sakshi News home page

తాగు నీటి సమస్యను అధిగమిస్తాం

Mar 30 2026 12:00 PM | Updated on Mar 30 2026 12:00 PM

మంచాల: గ్రామంలో తాగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆరుట్ల సర్పంచ్‌ మానుపాటి శోభ కుమార్‌ అన్నారు. ఆదివారం గ్రామంలో పర్యటించారు. 40 బోరు బావులను గుర్తించారు.నీటి సమస్య తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులు, ప్రజల సహకారంతో నీటి వనరులు ఉన్న చోట బోరు బావులకు మోటార్లు బిగిస్తున్నామని తెలిపారు. నీటిని పొందుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నూకం రాజు ముదిరాజ్‌, వార్డు సభ్యులు పున్నం రాము, బాలమణి, పద్మ, జంగయ్య, మౌనిక, మమత, నాయకులు జానీ పాష, చిందం రఘుపతి, జంగయ్య, పాండు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement