గ్రామ పాలనపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

గ్రామ పాలనపై దృష్టి సారించండి

Mar 29 2026 8:58 AM | Updated on Mar 29 2026 8:58 AM

అనంతగిరి: గ్రామ పాలన, సీసీ రోడ్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, ఇందిరమ్మ ఇళ్లు, గ్రామసభల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరెట్‌లోని సమావేశ మందిరంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 2వ తేదీ ప్రతి గ్రామంలో సభ నిర్వహించాలన్నారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమం పథకాల అమలుపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని సూచించారు. గ్రామ పాలనను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సుధీర్‌, డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, డీపీఓ జయసుధ పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement