● జిల్లా న్యాయమూర్తి సీహెచ్ చంద్రకిశోర్
● జిల్లాలో 38,097 కేసుల పరిష్కారం
అనంతగిరి: లోక్ అదాలత్‌లో రాజీపడి.. కేసుల నుంచి విముక్తి పొందాలని జిల్లా న్యాయమూర్తి సీహెచ్.చంద్రకిశోర్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో నిర్వహించిన అదాలత్‌లో ఆయన మాట్లాడారు. రాజీమార్గంతో కేసులను పరిష్కరించు కోవాలని చెప్పారు. ప్రతి వ్యక్తి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, ఇందులో భాగంగా గ్రామాలు, కళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 4 కోర్టుల్లో కలిపి మొత్తం 38,097 కేసులకు రాజీతో మార్గం దొరికిందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి, ఎస్పీ స్నేహమెహ్రా, పీపీలు మేరాజ్ పెర్దోష్, అన్వేష్‌సింగ్, సమీనాబేగం, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


