అనంతగిరి: ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి.. నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చరణ్‌సింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం నిరసన కార్యక్రమాలకు సన్నద్ధమైన ఉద్యోగులను పోలీసులు ముందుస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చరణ్‌సింగ్ మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నేరుగా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టి, సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మైపాల్, ఔట్ సోర్సింగ్ జిల్లా ఉపాధ్యక్షుడు భీమేష్, నాగేందర్‌రెడ్డి, వినోద్, దావూద్ పాల్గొన్నారు.
మార్కెట్ బీట్ల పరిశీలన
ధారూరు: వ్యవసాయ మార్కెట్లో శనివారం నిర్వహించిన బీట్లను ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి పరిశీలించారు. ఉత్పత్తుల కొనుగోలుపై ఆరా తీశారు. శనగలు, పసుపు, వేరుశెనగ, మొక్కజొన్నలు విక్రయించేందుకు వచ్చిన రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి సిద్దమ్మ, డైరెక్టర్లు అమరేశ్వర్‌రావు, రవీందర్‌రెడ్డి, రాములు, కమీషన్ ఏజెంట్లు పాల్గొన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
మంచాల: ఫాంహౌస్‌పై పోలీసులు దాడి చేసి పేకాటరాయుళ్లను అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలో చేటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. లింగంపల్లి గ్రామంలోని జీఆర్ ఫాంహౌస్‌లో శుక్రవారం రాత్రి పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. ఇందులో 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.2.28 లక్షల నగదు, 17 మొబైళ్ల స్వాధీనం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.


