నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలి

Mar 29 2026 8:58 AM | Updated on Mar 29 2026 8:58 AM

తాండూరు: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నాపరాతి పరిశ్రమను ఆదుకోవాలని గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ను తాండూరు క్వారీ ఓనర్స్‌, స్టోన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శనివారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి విన్నవించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇక్కడ లైమ్‌ స్టోన్‌, షాబాద్‌ స్టోన్‌ భూగర్భ నిక్షేపాలున్నాయని, పరిశ్రమపై ఆధారపడి 30 వేల కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. పరిశ్రమను మైనర్‌ మినరల్‌ జాబితాలో చేర్చాలని కోరారు. మేజర్‌ మినరల్‌లో చేర్చడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మరోవైపు రాయల్టీ, ఇతర పన్నులు కర్ణాటకతో పోల్చితే ఇక్కడి గనులపై అధిక భారం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయల్టీని పాత పద్ధతిన కొనసాగించాలన్నారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.ఇందులో క్వారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ రవూఫ్‌, స్టోన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంఏ నయీమ్‌, ఉపాధ్యక్షుడు ఓం ప్రకాష్‌ సోమాని, అన్వర్‌ అహ్మద్‌, ప్రధాన కార్యదర్శి జుబేర్‌ పాష ఉన్నారు.

మంత్రి వివేక్‌కు అసోసియేషన్‌ ప్రతినిధుల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement