అనంతగిరి: భూగర్భ జలాల పరిరక్షణ అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఆక్విఫర్ మ్యాపింగ్ 2.0 ప్రాజెక్ట్ పూర్తి కావడంతో గురువారం కలెక్టరేట్‌లో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నీటి వినియోగం పెరగడం, వర్షపాతం అసమానంగా ఉండడంతో భూగర్భ జలాల మట్టాలు ప్రభావితమవుతున్నాయని చెప్పారు. ప్రజలు, రైతులు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్డీఓ శ్రీనివాస్, పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


