వార్డు సభ్యులకు శిక్షణ | - | Sakshi
Sakshi News home page

వార్డు సభ్యులకు శిక్షణ

Mar 27 2026 10:13 AM | Updated on Mar 27 2026 10:13 AM

బంట్వారం: గ్రామ పంచాయతీలకు సంబంధించి విధులు, బాధ్యతలపై వార్డు సభ్యులు తప్పనిసరిగా అవగాహన ఉండాలని కోట్‌పల్లి ఎంపీడీఓ సురేందర్‌రెడ్డి అన్నారు. గురువారం బుగ్గాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రెండో రోజు నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులకు ఎంపీడీఓ హాజరై మాట్లాడారు. గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమైందన్నారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌, వార్డు సభ్యులు సమన్వయంతో పని చేస్తూ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించాలన్నారు. పంచాయతీ రాజ్‌ చట్టంలోని పలు అంశాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో ట్రైనర్లు రాజిరెడ్డి, రవి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement