నవాబుపేట: అక్రమంగా కలపను తరలిస్తున్న ఓ వాహనాన్ని పోలీసులు పట్టుకున్న సంఘటన నవాబుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై గిరి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మాదిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో బ్లూ కోట్ సిబ్బంది బుధవారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా నవాబుపేట నుంచి వస్తున్న అశోక్ లే ల్యాండ్ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కలపను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
ఇసుక ట్రాక్టర్లకు జరిమానా
ధారూరు: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లకు రూ.14 వేల జరిమానా విధించినట్లు తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.7 వేల చొప్పున జరిమానా విధించినట్లు తహసీల్దార్ చెప్పారు.
తడి, పొడి చెత్తపై అవగాహన
అనంతగిరి: మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య అన్నారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులో తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డు ప్రజలు చెత్తను వీధుల్లో వేయకూడదని చెత్త సేకరణ వాహనాలకు అందించాలని సూచించారు. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్ విజయలక్ష్మినాగరాజు, కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి, శానిటేషన్ ఇన్‌చార్జి ఏసుదాస్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఒంటిపూట.. గురువు రాక
దుద్యాల్: ఉపాధ్యాయులు పాఠశాలకు రాకున్నా విద్యార్థులు మాత్రం సమయానికి ప్రార్థన చేసిన సంఘటన మండలంలోని గురువారం చోటు చేసుకుంది. హస్నాబాద్ ప్రాథమిక పాఠశాలలో ఒంటిపూట బడులు కావడంతో విద్యార్థులు ఉదయం సమయానికి వచ్చారు. కానీ ఉపాధ్యాయులు రాకపోవడంతో పాఠశాల గదులు సైతం తెరుచుకోలేదు. అప్పటికే సమయం కావడంతో విద్యార్థులు ప్రార్థన చేశారు. కనీసం ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు రాకపోవడంతో గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
కొడంగల్ రూరల్: మండల పరిధి హుస్సేన్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో గురువారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌గా శివతేజ, డీఈఓగా హంసిక, ఎంఈఓగా శివరాజ్, హెచ్‌ఎంగా అజయ్‌కుమార్, పీఈటీగా నితిన్‌కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌గా శివకుమార్, కాంప్లెక్స్ హెచ్‌ఎంగా శివకుమార్, సీఆర్‌పీగా అనిరుద్‌లతో పాటు పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్య వహరించి, తోటి వారికి పాఠాలు చెప్పారు. ప్ర తిభ కనబరిచిన వారికి సర్పంచ్ అంజిలప్ప బ హుమతులు అందజేశారు. పాఠశాల హెచ్‌ఎం క్రాంతికుమార్, టీచర్ సంధ్య పాల్గొన్నారు.


