● ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
● రథ చక్రాలకు పూజలు
తాండూరు: ఉగాది పర్వదినం రోజున పట్టణంలోని భావిగి భధ్రేశ్వర దేవాలయ జాతర మొదటి ఘట్టాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథ చక్రాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింహులు, ఆలయ కమిటీ సభ్యులు, వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు.


