ఇసుక ట్రాక్టర్ పట్టివేత
యాలాల: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను యాలాల పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాగాయిపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసుల రాకను గుర్తించి ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. వాహనాన్ని పీఎస్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ధారూరు: మండలంలోని కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు గౌరప్ప శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాలీబాల్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్లోళ్ల రాములు ఆయనకు పార్టీ ఖండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పి.బసప్ప, నాయకులు చాంద్‌పాషా, వీరేశం తదితరులు పాల్గొన్నారు.
బొంరాస్‌పేట: ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఢిల్లెం పల్లెం ప్రదర్శనలో పాల్గొన్న మండలంలోని తుంకిమెట్లకు చెందిన డోలు కళాకారుడు జోగు మల్లేశ్‌గౌడ్‌ను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. మల్లేశ్ ప్రదర్శన గ్రామానికి గర్వకారమన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నర్సింలు, నాయకులు నాగూరావు, బాబయ్య నాయుడు, అనిల్‌కమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పహాడీషరీఫ్: తండ్రి మందలించడంతో యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి గ్రామానికి చెందిన పబ్బు నారాయణ కుమార్తె మనీష (21) శంషాబాద్ విమానాశ్రయంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. జాబ్ మానేయాలని ఈ నెల 26న తండ్రి మందలించాడు. దీంతో అదేరోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిన ఆమె, హాస్టల్‌లో ఉన్నానని తన సోదరికి రాత్రి మెసేజ్ పంపింది. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో ఆమె ఆచూకీ కోసం వెతికినా లాభం లేకుండా పోయింది. ఈ విషయమై ఆమె తండ్రి గురువారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ ఠాణాలో గానీ, 87126 62367 నంబర్‌లోగానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.
శంషాబాద్ రూరల్: శ్రీ భగవద్రామానుజలకు అభిషేకంతో ముచ్చింతల్‌లో సమతాకుంభ్ ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో ఉన్న సమతాస్ఫూర్తి కేంద్రం ఆవరణలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో ఉత్సవాలకు అంకురారోపణ జరిగింది. శ్రీ భగవద్రామానుజుల సువర్ణ మూర్తికి జీయర్‌స్వామి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విశిష్టతను తెలియజేశారు. అహోబిల జీయర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
ఇసుక ట్రాక్టర్ పట్టివేత


