అభివృద్ధే కాంగ్రెస్ నినాదం
కొడంగల్: మున్సిపల్ పరిధిలోని 12 వార్డులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అప్పాయిపల్లికి అగ్రికల్చర్ యూనివర్సిటీ మంజూరైనట్లు తెలిపారు. హుస్సేన్‌పూర్‌లో 300 ఎకరాల భూ సేకరణ చేసి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ధర్మాపూర్ శివారులో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కసరత్తు జరుగుతోందన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌లతో చర్చించి సమన్వయంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఎవరికి అపోహలు వద్దని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మహ్మద్ యూసూఫ్, నయీమ్, మురహరి వశిష్ట, ఆసీఫ్‌ఖాన్, దాము, ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


