అసైన్డ్ భూముల సర్వే
యాచారం: ఫార్మాసిటీ భూసేకరణలో నక్కర్తమేడిపల్లి, కుర్మిద్ద గ్రామాల్లో భూసేకరణ చేయకుండా వదిలేసిన సర్వే నంబర్లల్లోని భూమిని సేకరించడానికి అధికారులు నిర్ణయించారు. ఆర్‌ఐ మురళి ఆధ్వర్యంలో శుక్రవారం నక్కర్తమేడిపల్లిలోని సర్వేనంబరు 430 లోని అసైన్డ్ భూమిని సర్వే నిర్వహించారు. ఈ సర్వేనంబర్‌లో 39 ఎకరాల భూమి ఉంటుంది. అసైన్డ్ సర్టిఫికెట్లు పొందిన రైతుల వివరాలతో కూడిన కబ్జాను సర్వే చేశారు. కుర్మిద్దలోని 309, 328 సర్వేనంబర్లల్లోని అసైన్డ్ భూమిని సర్వే చేయనున్నారు. ఈ రెండు సర్వే నంబర్లల్లో కేవలం 30 ఎకరాల వరకే భూమి ఉంటుంది. సర్వే చేసి కబ్జా రైతుల వివరాలను గుర్తిస్తారు. రెండు గ్రామాల్లో సర్వే చేసే అసైన్డ్ భూమికి ప్రస్తుతం ఏ మేరకు పరిహారం చెల్లిస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఫార్మాసిటీ భూసేకరణ సమయంలో అసైన్డ్ భూములు ఎకరాకు రూ.8లక్షలు, కబ్జాలో ఉన్న రైతులకు ఎకరాకు రూ.7.70 లక్షల పరిహారం చెల్లించారు. ప్రస్తుతం సర్వే చేసే భూములకు గతంలోని పరిహారాన్నే చెల్లిస్తారా.. లేదా పరిహారం పెంచి ఇస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
పరిహారంపై స్పష్టత కరువు


