చివరి రోజు జోరుగా.. | - | Sakshi
Sakshi News home page

చివరి రోజు జోరుగా..

Jan 31 2026 9:34 AM | Updated on Jan 31 2026 9:34 AM

చివరి

చివరి రోజు జోరుగా..

అనంతగిరి: వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 34 వార్డులకు శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కావడంతో ఉదయం నుంచే అభ్యర్థులు తరలివచ్చారు. సాయంత్రం 5గంటల వరకు కేంద్రంలో ఉన్న వారి నుంచి అధికారులు పత్రాలు స్వీకరించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు బీ ఫామ్‌లు లేకుండా నామినేషన్లు వేశారు. ఆయా పార్టీలు బీఫామ్‌లు ఎవరికి ఇస్తాయో వేచి చూడాలి. నామినేషన్‌ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకుడు జి.రవి పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్‌ కలెక్టర్‌ సుధీర్‌, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ అనుచరులతో వచ్చి నామినేషన్‌ వేశారు. చైర్మన్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న గడ్డం అనన్య రెండు వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేయగా, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి 10వ వార్డు నుంచి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్‌ 18వ వార్డు నుంచి, మాజీ కౌన్సిలర్‌ లక్ష్మికాంత్‌రెడ్డి ఆలంపల్లి నుంచి నామినేషన్లు వేశారు.

కొడంగల్‌లో..

కొడంగల్‌: కొడంగల్‌ మున్సిపల్‌ పరిధిలోని 12 వా ర్డులకు గాను శుక్రవారం 52 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రోజు ఒక్కటి కూడా రా లేదు. రెండో రోజు 20, చివరి రోజు 52తో మొత్తం 72 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నామినేష న్‌ పత్రాలు సమర్పించిన వారిలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్‌ తదితరులు ఉన్నారు.

తాండూరు టౌన్‌లో..

తాండూరు టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నామినేషన్ల సమర్పణకు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు 28న 11 మంది, 29న 94 మంది, 30న 85 మంది మొత్తం 190 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో బీఎస్పీ ఒకటి, ఎంఐఎం 16, బిజెపి 49, కాంగ్రెస్‌ 88, బిఆర్‌ఎస్‌ 96, ఇతరులు 8, స్వతంత్రులు 15 సెట్ల నామినేషన్లు సమర్పించారు. వీరిలో బిఆర్‌ఎస్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పట్లోళ్ల న ర్సింహులు, పట్లోళ్ల దీప దంపతులు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, ఎన్నికల ఇంచార్జి శ్రీశైల్‌ రెడ్డితో కలిసి డప్పువాయిద్యాల నడుమ ఊరేగింపుగా నామినేషన్‌ కేంద్రానికి వచ్చారు. పట్లోళ్ల నర్సింహులు 10వ వార్డుకు, ఆయన సతీమణి మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పట్లోళ్ల దీప 9వ వార్డుకు బిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నామినేషన్‌ వేశారు. కొట్రిక నాగలక్ష్మి 24వ వార్డుకు నామినేషన్‌ వేశారు. మరో వైపు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డితో కలిసి పట్లోళ్ల బాల్‌రెడ్డి 12వ వార్డుకు, బంటు వేణుగోపాల్‌ 11వ వార్డుకు, గౌరి రాములు 18వ వార్డుకు, 8వ వార్డుకు సాయప్ప, 20వ వార్డుకు బిర్కట్‌ జ్యోతి, మరికొందరు కూడా పలు వార్డులకు నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్‌కుమార్‌తో కలిసి పలువురు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. 11వ వార్డులో ఇందూరు రాములు, 24వ లో సాహు శ్రీలత, ఆరులో దోమ కృష్ణ, 31లో అరవింద్‌, తొమ్మిదిలో విజయశాంతి తదితరులు నామినేషన్‌ వేశారు. అంతే కాకుండా పలువురు ఎంఐఎం అభ్యర్థులు సైతం పలు వార్డులకు నామినేషన్లు వేశారు. కాగా నామినేషన్‌ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్‌ ఎస్పీ బీఆర్‌ నాయక్‌, డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య, పట్టణ సీఐ సంతోష్‌ కుమార్‌, ఎస్సైలు అమ్రయ్య, సాజిద్‌ బందోబస్తులో ఉన్నారు.

అభ్యర్థులకు మద్దతుగా నేతలు

పరిగి: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా పలువురు నేతలు తమ అభ్యర్థులకు మద్దతుగా వచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులతో స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ బలపర్చిన వారితో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, బీజేపీ కేండెట్లతో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్లు వేయించారు.

నామినేషన్ల దాఖలు

చివరి రోజు జోరుగా.. 1
1/1

చివరి రోజు జోరుగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement