కలెక్టరేట్‌లో మీడియా పాయింట్
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వార్తలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీపీఆర్‌ఓ కార్యాలయంలో మీడియా పాయింట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే రాజకీయ వార్తలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. దినపత్రికలు, స్థానిక ఛానళ్లలో వచ్చే వార్తలను నిశితంగా గమనించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు, ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సుధీర్, రాజేశ్వరి, ఆర్‌డీఓ వాసుచంద్ర, డీపీఆర్‌ఓ చెన్నమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, అసిస్టెంట్ పీఆర్‌ఓ ప్రభాకర్, తహసీల్దార్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.


