ముళ్ల పొదల్లో పసికందు మృతదేహం
అనంతగిరి: నెలన్నర పసికందును ముళ్ల పొదల్లో పడేసిన ఘటన వికారాబాద్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాండ్ పరిసరాల్లోని ముళ్లపొదల్లో మగశిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాబును పరిశీలించగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. మృతశిశువును వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా, పసికందు బతికి ఉండగానే ఇక్కడ పడేశారా..? చనిపోయాక పడేశారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుకుమార్ తెలిపారు.
అవగాహన కల్పించండి
అనంతగిరి: మహిళా సమాఖ్య విధి విధానాలు, వాటి బలోపేతానికి తీసుకుంటున్న చర్యల గురించి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని డీఆర్‌డీఓ శ్రీనివాస్ తెలిపారు. వికారాబాద్‌లోని జిల్లా మహిళా సమాఖ్యలో మహబూబ్‌నగర్ మహా సమాఖ్య నుంచి వచ్చిన సీనియర్ సీఆర్పీలకు పది రోజులుగా శిక్షణ ఇచ్చారు.
ముళ్ల పొదల్లో పసికందు మృతదేహం


