బీజేపీ గెలుపు ఖాయం
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీతోనే అభివృద్ధి సాధ్య మని పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్‌లోని మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్లు వేసేందుకు వచ్చిన బీజేపీ అభ్యర్థులను ఆయన పలకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందన్నారు. మున్సి పాలిటీలకు, పంచాయతీలకు కేంద్రం నుంచే నిధులు వస్తాయన్నారు. దేశవ్యాప్తంగా మోదీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జ్ బంగారు శ్రుతి, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


