కాషాయ జెండా ఎగురవేస్తాం
తాండూరు టౌన్: తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం చివరి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 32 స్థానాల్లో పోటీకి దిగినట్లు చెప్పారు. కాంగ్రెస్ దౌర్జన్యం పెచ్చుమీరిందని, వారికి సరైన అభ్యర్థులు దొరకడం లేదన్నారు. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులను ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయించారని ఆరోపించారు. పట్టణంలో 14వేలకు పైగా మైనార్టీ ఓటర్లను కొత్తగాఓటరు లిస్టులో చేర్పించారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారన్నారు. 36 వార్డులకు గాను 18కి పైగా స్థానాలను బీజేపీ కై వసం చేసుకుని కాషాయజెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్, నాయకులు బాలేశ్వర్ గుప్తా, మల్లేశం, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


