ఆచితూచి అడుగులు
వ్యూహాత్మకంగా ముందుకు.. వేచి చూసే ధోరణిలో పార్టీలు ఆందోళనలో ఆశావహులు ప్రచారానికి సమయం సరిపోదని బెంబేలు పరిగి, తాండూరులోబీఆర్‌ఎస్ ఓ అడుగు ముందుకు
వికారాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఇరు పార్టీల ముఖ్య నేతలు వేచి చూసే ధోరణితో ముందుకు సాగుతున్నారు. ఆయా వార్డుల్లో సాధారణ కౌన్సిలర్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కొంత వరకు ప్రకటించగా చైర్ పర్సన్ అభ్యర్థుల విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తాండూరులో మాత్రం బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థిగా మాజీ వైస్ చైర్‌పర్సన్ భర్త నర్సింహులు మొదటి రోజే తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. పరిగిలోనూ చైర్మన్ అభ్యర్థి ఎవరనే విషయంలో తీవ్ర పోటీ కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు శివన్నొళ్ల భాస్కర్ తన సతీమణిని 4వ వార్డు నుంచి బరిలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎవరనే దానిపై సందిగ్దత నెలకొంది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. వికారాబాద్‌లో ఇరు పార్టీల నుంచి ముఖ్య నేతల వారసులు బరిలో ఉంటారనే ఊహాగానాల మధ్య రాజకీయం వేడెక్కినప్పటికీ ఇప్పటి వరకు ఏ పార్టీ కూ డా తమ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎవరనేది చెప్పలేదు.
వార్డుల విషయంలోనూ..
చైర్మన్ అభ్యర్థుల తరహాలోనే వార్డుల విషయంలోనూ వేచి చూసూ ధోరణి కనిపిస్తోంది. ఫలానా వార్డులో ఫలానా నాయకుడికి టికెట్ ఇద్దామని ముఖ్య నేతలు మనసులో ఫిక్స్ అయినా బయటకు మాత్రం చెప్పడం లేదు. ఒకే పార్టీ నుంచి ఒకే వార్డుకు ఒకటి కంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ముందుగానే ప్రకటిస్తే టికెట్ ఆశించి భంగపడిన నేతలు పక్క పార్టీల్లోకి జంప్ చేసే ప్రమాదం ఉండటంతో నేతలు ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోంది. బీఆర్‌ఎస్‌లో ఇప్పటి వరకు చైర్మన్ అభ్యర్థి ఎవరనే విషయంలో రెండు మున్సిపాలిటీల్లో స్పష్టత రాగా అధికా ర కాంగ్రె స్‌లో అన్ని మున్సిపాలిటీల్లో నూ డోలాయమానంలోనే ఉండి పో యింది. మరోవైపు బీజే పీ ఇప్పటి వర కు ఎలాంటి కార్చా చరణ కూడా ప్రారంభించలేదు. అన్ని పార్టీలు వేచి చూసే ధోరణి అవలంబిస్తుండటంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. తొందరగా అభ్యర్థులను ప్రకటిస్తే వార్డుల్లో పర్యటించి తమకు అనుకూల వాతావరణం కల్పించుకునేందుకు వీలవుతుందని.. లేదంటే సమయం సరిపోక ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావనలో ఉన్నారు.
ఆ వార్డులే కీలకం
మున్సిపల్ పీఠం కై వసం చేసుకునే విషయంలో వార్డులే కీలకం. చైర్‌పర్సన్ అభ్యర్థులు పోటీ చేసేందుకు వీలున్న వార్డులు మరింత ప్రాధాన్యంగా మారనున్నాయి. దీంతో పార్టీలు సైతం ఆ వార్డులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అలాంటి వార్డుల్లో ఆయా సామాజిక వర్గాలకు చెందిన బలమైన నేతలను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొడంగల్ పురపాలిక జనరల్ కాగా 4, 6వ వార్డులు అన్ రిజర్వ్ వార్డులుగా ఉన్నాయి. ఇక్కడ ఓసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలో దింపేందుకు అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి వర్గానికి చెందిన ప్రశాంత్‌ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరు భావిస్తుండగా గురునాథ్ రెడ్డి వర్గం సపోర్టు చేస్తుందా..? లేదా అనే ఆత్మరక్షణలో పడిపోయి ప్రకటించేందుకు వెనకాడుతున్నట్టు సమాచారం. పరిగి మున్సిపల్ బీసీ మహిళకు రిజర్వ్ కాగా ఇక్కడ 1, 13, 14వ వార్డులు బీసీ మహిళకు కేటాయించారు. వాటితో పాటు బీసీ జనరల్ స్థానిల్లో కూడా మహిళలను పోటీ చేయించేందుకు వీలుంది. వికారాబాద్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా ఇక్కడ 9, 13, 21వ వార్డులు ఎస్సీ మహిళకు కేటాయించారు. చైర్మన్ అభ్యర్థులను ఈ వార్డులతో పాటు ఎస్సీ జనరల్ స్థానాలు, అన్ రిజర్వ్ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. తాండూరులో చైర్మన్ పదవి బీసీ జనరల్ కాగా ఇక్కడ బీసీ మహిళలు, పూర్తిగా అన్ రిజర్వ్ స్థానాల నుంచి గెలిచిన బీసీ అభ్యర్థులు కూడా చైర్మన్ పదవికి అర్హులు కానున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యేందుకు అనుకూలంగా ఉండే ఈ వార్డులే ప్రస్తుత ఎన్నికల్లో కీలకం కానున్నాయి. పార్టీలు కూడా ఈ వార్డులపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి.
చైర్మన్ అభ్యర్థులప్రకటనపై సందిగ్దత


