వెనకబాటుకు కారణం వారే
ఆమనగల్లు: బీఆర్‌ఎస్‌తోనే ఆమనగల్లు అభివృద్ధి సాధ్యమని గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ మున్సిపల్ ఇన్‌చార్జ్ రజినిసాయిచంద్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ అన్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు పాపిశెట్టి రాము, శ్వేత, విఠాయిపల్లికి చెందిన బీజేపీ నాయకుడు జగదీశ్వర్, పద్మ దంపతులు గురువారం బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆమనగల్లు వెనకబాటుకు కారకులను గుర్తించి ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మున్సిపాలిటీకి రూ.100 కోట్లు తెచ్చి, అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్ హయాంలో మంజూరైన పనులకు ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆమనగల్లు మున్సిపాలిటీ వెనుకబాటుకు బీజేపీ నేతలే కారణమని మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రజలు బీఆర్‌ఎస్‌ను గెలిపించి, మార్పు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్, బీఆర్‌ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జీఎల్‌ఎన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు నిర్మల శ్రీశైలంగౌడ్, అనురాధ, నిరంజన్‌గౌడ్, సయ్యద్ ఖలీల్, శ్రీశైలంగౌడ్, నాలాపురం శ్రీనివాస్‌రెడ్డి, అర్జున్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ హాయంలోనే
ఆమనగల్లు అభివృద్ధి
రజనీసాయిచంద్, జైపాల్‌యాదవ్,
శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్ పిలుపు
గులాబీ గూటికి పలువురు నేతలు


