అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేస్తా | - | Sakshi
Sakshi News home page

అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేస్తా

Jan 30 2026 11:28 AM | Updated on Jan 30 2026 11:28 AM

అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేస్తా

అవకాశం ఇస్తే.. అభివృద్ధి చేస్తా

● కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ● 10వ వార్డులో ఎన్నికల ప్రచారం

అనంతగిరి: ప్రజా సేవ చేసేందుకు అవకాశం ఇస్తే అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్‌లోని అనంతగిరిపల్లి 10 వార్డులో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10వ వార్డు ప్రజలు తనకు అవకాశం ఇస్తే ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement