బీజేపీలోకి ముకుంద నాగేశ్
● ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
సమక్షంలో చేరిక
● పార్టీ బలోపేతం, అభ్యర్థుల
గెలుపునకు కృషి చేస్తానని వెల్లడి
పరిగి: తెలంగాణ ఉద్యమ నేత, జేఏసీ రాష్ట్ర నాయకుడు ముకుంద నాగేష్ గురువారం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. పదిహేనేళ్లుగా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న ఆయన బీజేపీ నుంచి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు మున్సిపల్ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టంచేశారు. పరిగి ఎన్నికల్లో బీజేపీ కీలక భూమిక పోషించనుందన్నారు. ఎంపీని కలిసిన వారిలో బీజేపీ నాయకులు కరణం ప్రహ్లాద్‌రావు, వెన్న ఈశ్వరప్ప, మారుతికిరణ్, శరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


