బరిలో ఉన్నత విద్యావంతురాలు
● బీజేపీ అభ్యర్థిగా
డాక్టర్ కవితరాంచంద్రయ్య
● వికారాబాద్ 21వ వార్డు నుంచి పోటీ
అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామయ్యగూడ ఎంఐజీ 21వ వార్డు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కవితారాంచంద్రయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎంఏ, పీహెచ్‌డీ(సోషియాలజీ) చదివిన ఆమె ప్రస్తుతం ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని మోదీ ఆలోచనా విధానాలకు ఆకర్షితురాలై ఆపార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఏకై క లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టంచేశారు. వార్డు ప్రజలందరూ ఆదరించి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


