ఎన్నికలు సజావుగా సాగాలి
● అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయండి
● కలెక్టర్ ప్రతీక్‌జైన్
కొడంగల్: నామినేషన్లు వేసే క్రమంలో అభ్యర్థులకు వచ్చే సందేహాలను అధికారులు నివృత్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. నామినేషన్ పత్రాలకు ఏయే పత్రాలు జత చేయాలో స్పష్టంగా తెలియజేయాలన్నారు. గురువారం కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కొడంగల్‌లో ఏర్పాటు చేసిన 4 కౌంటర్లలో ఉన్న 8 మంది ఆర్వోలతో మాట్లాడారు. నామినేషన్ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌తో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
261 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
తాండూరు: జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ సెంటర్‌ను పరిశీలించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 261 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాలుగు పురపాలికల్లో 54 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


