భక్తిశ్రద్ధలతో మహాయాగం
తుర్కయంజాల్: ఆదిబట్ల సర్కిల్ పరిధి రాగన్నగూడలో నిర్వహిస్తున్న మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం గురువారం రెండో రోజుకు చేరింది. ప్రాతఃకాల పూజలు, వేద పారాయణాలు, చండీ అనుష్టానములు, రుద్రపారాయాణాదులు, అభిషేకం, లక్ష బిల్వార్చన, మేధా దక్షిణమూర్తి హోమం, హంస వాహనసేవ, కొడకండ్ల రాధాకృష్ణచే నాదనీరాజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


