రోడ్డు నియమాలు పాటిద్దాం
ఆర్టీవో వెంకట్‌రెడ్డి
అనంతగిరి: రోడ్డు భద్రత మసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల బస్సు డ్రైవర్లకు బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీవో వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం సహకరించినప్పుడు ఏ పనైనా చేయగలమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. స్కూల్ బస్సులు నడిపేవారు విద్యార్థులను సురక్షితంగా గమ్యాలకు చేర్చాలన్నారు. అనంతరం ఆర్‌టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్ మాట్లాడారు. రోడ్డు భద్రత మనందరి బాధ్యత అన్నిరు. మహావీర్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ గురురాజ్ వాలి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరిగాయి. కార్యక్రమంలో ఏఎంవీఐ వరుణ్ కుమార్, స్కూల్ బస్సు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.


