ఆవిష్కరణలపై దృష్టిసారించాలి
పీఎంశ్రీ స్కూల్స్ సదస్సుల్లో విద్యావేత్తల పిలుపు
అబ్దుల్లాపూర్‌మెట్: ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో తెలంగాణ రీజియన్‌లోని పీఎంశ్రీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాకులకు మూడు రోజుల పాటు మెంటరింగ్ సదస్సులు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని పిగ్లీపూర్ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఇందుకు వేదికై ంది. రాష్ట్రంలోని మొత్తం 3 కళాశాలలో మాత్రమే ఈ సదస్సులు నిర్వహిస్తుండగా బుధవారం సదస్సును ప్రారంభించారు. పీఎంశ్రీ స్కూల్స్‌కు చెందిన వంద మంది విద్యార్థులు, వంద మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కళాశాల కార్యదర్శి సి.గంగిరెడ్డి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. కొత్త ఆవిష్కరణలపై దృష్టిసారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ఎల్‌వీ వేణుగోపాలరావు, ఏఐసీటీఈ నోడల్ హెడ్ అసీమ్‌కల్టా, వాడ్వాని ఫౌండేషన్ వక్త డాక్టర్ రాజేశం, శ్వేతలు పాల్గొని ఏఐసీటీఈ నుంచి పరిశోధన నిధుల కోసం వినూత్న ఆలోచనలు అంశంపై వివరించారు.


